||సుందరకాండ ||

||అరువది ఇదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 65 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచషష్టితమస్సర్గః||

శ్లో|| ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలమ్||1||
యువరాజం పురస్కృత్య సుగ్రీవ మభివాద్య చ|
ప్రవృత్తి మథ సీతాయాః ప్రవక్తుముపచక్రమే||2||

స|| తతః చిత్రకాననం ప్రస్రవణం శైలం గత్వా శిరసా మహాబలం రామం లక్ష్మణం చ ప్రణమ్య యువరాజం పురస్కృత్య సుగ్రీవం అభివాద్య చ సీతాయాః ప్రవృత్తిం ప్రవక్తుం ఉపచక్రమే ||

తా|| అప్పుడు వానరులు చిత్రమైన వనములు కల ప్రస్రవణ పర్వతము చేరి మహాబలురు అగు రామ లక్ష్మణులకు నమస్కరించి యువరాజును ముందు ఉంచుకొని సుగ్రీవునకు అభివాదము చేసి సీత యొక్కప్రవృత్తిని వివరించుటకు సిద్ధము అయ్యిరి.

శ్లో|| రావణాంతః పురే రోధం రాక్షసీభిశ్చ తర్జనమ్|
రామే సమనురాగం చ యశ్చాయం సమయః కృతః||3||
ఏతదాఖ్యాంతి తే సర్వే హరయో రామసన్నిధౌ|

స|| తే సర్వే హరయోః రావణాంతః పురే రోధం రాక్షసీభిః చ తర్జనమ్ రామే సమనురాగం చ యత్ అయం సమయః కృతః రామ సన్నిధౌ ఏతత్ ఆఖ్యాన్తి ||

తా|| ఆ వానరులందరూ రావణాంతఃపురములో నిర్బంధిచబడిన, రాక్షసస్త్రీలచే భయపెట్టబడిన , రామునిపై అనురాగము కల సీత గురించి, కాలపు గడువు దాటిపోయి వున్నవిషయము , తదితర ఆన్ని విషయములు రాముని సన్నిధిలో చెప్పిరి.

శ్లో|| వైదేహీమక్షతాం శ్రుత్వా రామస్తూత్తరమబ్రవీత్||4||
క్వ సీతా వర్తతే దేవీ కథం చ మయి వర్తతే|
ఏతన్మే సర్వ మాఖ్యాతం వైదేహీం ప్రతి వానరాః||5||

స||వైదేహీం అక్షతాం శ్రుత్వా రామస్తు ఉత్తరం అబ్రవీత్|| సీతా క్వ వర్తతే | దేవీ మయి కథం వర్తతే | వైదేహీం ప్రతి ఏతత్ సర్వం వానరాః ఆఖ్యాతం||

తా|| సీత క్షితించలేదని వినిన రాఘవుడు వారిని అడిగెను. "సీత ఎలాగ వున్నది? దేవీ నాగురించి ఏమనుకుంటున్నది ? వానరులారా వైదేహి గురించి ఇదంతా నాకు చెప్పండి" అని.

శ్లో|| రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ|
చోదయంతి హనూమంతం సీతావృత్తాంత కోవిదమ్||6||
శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః|
ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి||7||
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయా దర్శనం యథా|

స|| హరయః రామస్య గదితం శ్రుత్వా సీతావృత్తాంతకోవిదం హనుమంతం రామసన్నిధౌ చోదయన్తి||హనుమాన్ మారుతాత్మజః తేషాం వచనం శ్రుత్వా దేవ్యై సీతాయై తాం దిశాం ప్రతి శిరసా ప్రణమ్య యథా సీతాయాః దర్శనం వాక్యజ్ఞః వాక్యం ఉవాచ||

తా|| రామునిచే చెప్పబడిన మాటలు విని వానరులు సీతావృత్తాంతము క్షుణ్ణముగా ఎరిగిన హనుమంతుని ప్రార్థించిరి. మారుతాత్మజుడైన హనుమంతుడు వారి వచనములను విని సీతాదేవి కి, ఆ దిశలో తిరిగి తలవంచి నమస్కరించి , సీతాదేవిని దర్శించిన విధానము గురించి ఇట్లు చెప్పసాగెను.

శ్లో|| సముద్రం లంఘయిత్వాఽహం శతయోజనమాయతమ్||8||
అగచ్ఛం జానకీం సీతాం మార్గమాణో దిదృక్షయా|
తత్ర లంకేతి నగరీ రావణస్య దురాత్మనః||9||
దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే |

స|| అహం శతయోజనం ఆయతం సముద్రం లంఘయిత్వా జానకీం సీతాం దిదృక్షయా మార్గమాణః ఆగచ్ఛం ||తత్ర సముద్రస్య దక్షిణస్య తీరే లంకా ఇతి రావణస్య నగరీ తత్ర దురాత్మన్ః వసతి||

తా|| "నేను సీతను వెదుకుటకొఱకై నూరు యోజనములు వెడల్పు కల సముద్రమును దాటి వచ్చితిని. అక్కడ ఆ దక్షిణ తీరమున లంక అనబడు రావణుని నగరము కలదు. అక్కడ ఆ దురాత్ముడు నివశించుచుండెను".

శ్లో|| తత్ర దృష్టా మయా సీతా రావణాంతః పురే సతీ||10||
సన్న్యస్య త్వయి జీవంతీ రామా రామమనోరథమ్|
దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః||11||
రాక్షసీభిర్విరూపాభీ రక్షితా ప్రమదావనే|

స|| రామా తత్ర రావణాంతః పురే సతీ త్వయి మనోరథం సన్న్యస్యజీవన్తీ రామ సీతా మయా దృష్టా||ప్రమదావనే విరూపాభిః రాక్షసీభిః రక్షితా ముహుర్ముహుః తర్జ్యమానా (సీతా) మే రాక్షసీ మధ్యే దృష్టా ||

తా|| "ఓ రామా ! అక్కడ రావణాంతఃపురములో వున్న, నీ పై మనస్సు ఉంచుకొని వున్న అన్నిటినీ సన్న్యశించి జీవిస్తున్న, సీతను నేను చూచితిని. ప్రమదావనములో రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న , మాటికీ మాటికీ భయపెట్టబడుచున్న , రాక్షస స్త్రీల మధ్యలో వున్న సీతను చూచితిని".

శ్లో|| దుఃఖమాసాద్యతే దేవీ తథాఽదుఃఖోచితా సతీ||12||
రావణాంతః పురే రుద్ధా రాక్షసీభిః సురక్షితా|
ఏకవేణీధరా దీనా త్వయి చింతాపరాయణా||13||
అథశ్శయా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే|
రావణాద్వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా||14||
దేవీ కథంచిత్ కాకుత్‍స్థ త్వన్మనా మార్గితా మయా|

స|| తథా దుఃఖోచితా దేవీ దుఃఖం ఆసాద్యతే రావణాంతః పురే రుద్ధా రాక్షసీభిః సతీ (మయా కథంచిత్ మార్గితా)| ఏకవేణీ ధరా త్వయి చిన్తాపరాయనా దీనా అథః శయ్యా హిమాగమే పద్మినీం ఇవ వివర్ణాంగీ (మయా సతీ కథంచిత్ మార్గితా)|| రావణాత్ వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా కాకుత్‍స్థ త్వన్మనాః దేవీ కథంచిత్ మయా మార్గితా||

తా|| ఆ విధముగా దుఃఖములో ఉన్న, దుఃఖము అనుభవించతగని దేవిని రావణాంతః పురములో రాక్షస స్త్రీల మధ్యలో వున్న దేవిని ఎలాగో చూచితిని. ఒకే జడవేసికొని నీగురించే ఆలోచనలో ఉన్న, భూమిమీద పడుకొని ఉన్న, కాంతి విహీన అయి ఉన్న సీతను ఎలాగో చూచితిని. రావణునిపై విముఖీ అయి వున్న , మరణించుటకు నిశ్చయించుకొనిన, కాకుస్ఠునిపై మనసు వుంచుకొని ఉన్న ఆ దేవి ఎలాగో చూచితిని.

శ్లో|| ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తయతానఘా||15||
స మయా నరశార్దూల విశ్వాసముపపాదితా|
తతః సంభాషితా దేవీ సర్వమర్థం చ దర్శితా||16||
రామసుగ్రీవసఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగతా|
నియతస్సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి||17||

స|| అనఘ నరశార్దూల ఇక్ష్వాకువంశ విఖ్యాతిం శనైః కీర్తయతా మయా సా విశ్వాసం ఉపపాదితా||తతః దేవీ సంభాషితా సర్వం అర్థం దర్శితా రామసుగ్రీవ సఖ్యం చ| అస్యాః సముదాచారః నియతః తథా త్వయి భక్తిశ్చ శ్రుత్వా ప్రీతిం ఉపాగతా ||

తా|| ఓ అనఘా ! నరశార్దూలా ! ఇక్ష్వాకు వంశ కీర్తిని నెమ్మదిగా గానము చేసి నాచేత ఆమెకు విశ్వాసము కలిగింపబడినది.అప్పుడు దేవితో సంభాషించి సమస్త విషయములు రామసుగ్రీవుల మైత్రి కూడా తెలియ చేసితిని. ఆమె యొక్క ఆచారములు నిష్ఠ అదే విధముగా నీపై భక్తి విని సంతోషము నెలకొన్నది.

శ్లో|| ఏవం మయా మహాభాగా దృష్టా జనక నందినీ|
ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ||18||

స|| పురుషర్షభ ఉగ్రేణ తపసా త్వత్ భక్త్యా యుక్తా మహాభాగా జనకనందినీ మయా ఏవం దృష్టా||

తా|| ఓ పురుషోత్తమా ! నీ పై భక్తితో నిండిన కఠోర తపస్సులో ఉన్న మహాభాగ్యవంతురాలూ జనకుని కుమార్తె అయిన సీత నా చేత చూడబడినది.

శ్లో|| అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవాంతికే|
చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ||19||
విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రో రామో వాయుసుత త్వయా|
అఖిలేనేహ యద్దృష్టమితి మాం ఆహ జానకీ||20||

స|| మహాప్రాజ్ఞ చిత్రకూటే తవ అన్తికే వాయసం ప్రతి యథా వృత్తం అభిజ్ఞానం మే దత్తం||వాయుసుత నరవ్యాఘ్రః రామః త్వయా ఇహ యత్ దృష్టం అఖిలేన విజ్ఞ్యాప్యః ఇతి జానకీ మామ్ ఆహ||

తా|| "ఓ మహాప్రాజ్ఞ ! చిత్రకూటములో వాయసముపై జరిగిన వృత్తాంతము ఒక గుర్తుగా నీకు చెప్పుటకు నాకు చెప్పినది. జానకీ దేవి నాతో , " ఓ వాయుపుత్రా రామునకు నీవు ఇక్కడ చూచినది అంతా విన్నవించుము " అని చెప్పెను.

శ్లో|| అయం చాస్మై ప్రదాతవ్యో యత్నాత్ సుపరిరక్షితః|
బ్రువతా వచనా న్యేవం సుగ్రీవ స్యోపశృణ్వతః||21||

స|| సుగ్రీవస్య ఉపశ్రుణ్వతః ఏవం వచనాని బ్రువతా| యత్నాత్ సుపరిరక్షితః అయం చ ప్రదాతవ్యః||

తా|| "సుగ్రీవుడు వినునట్లు ఈ వచనములు చెప్పుము. నా చేత రక్షింపపబడిన దీనిని ( ఈ చూడామణిని) ఇవ్వతగును".

శ్లో|| ఏష చూడామణిః శ్రీమాన్ మయా సుపరిరక్షితః|
మనశ్శిలాయాః తిలకమ్ గణ్డపార్శ్వే వివేశితః ||22||
త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి|
ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారిసంభవః||23||
ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వా మివానఘ|

స|| శ్రీమాన్ ఏషః చూడామణిః మయా సుపరిరక్షితః | తిలకే ప్రణష్ఠే త్వయా మనస్సిలాయాః తిలకః గణ్డపార్శ్వే నివేసితః కిల | తం స్మర్తుం అర్హసి||అనఘ దివ్యః నిర్యాతితః శ్రీమాన్ వారిసంభవః వ్యసనే ఏతం మయా దృష్ట్వా త్వాం ఇవ ప్రహృష్యామి||

తా|| " ఈ చూడామని నా చేత పరిరక్షింపబడెను. నా తిలకము చెరిగిపోయినప్పుడు మణిశిలను అరగదీసి చెక్కిలి మీద రాశిన వాడవు. అది జ్ఞాపకము చేసికొనగలవు. ఓ అనఘా ఈ దివ్యమైన జలనిధిలో జన్మించిన చూడామణిని పంపిస్తున్నాను.నిజానికి దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నదానను"

శ్లో|| జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ||24|
ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగతా|
ఇతి మామబ్రవీత్ సీతా కృశాంగీ ధర్మచారిణీ||25||
రావణాంతః పురే రుద్ధా మృగీ వోత్ఫుల్లలోచనా|

స|| దశరథాత్మజ జీవితం మాసం ధారయిష్యామి | రక్షసాం వశం ఆగతా మాసాత్ ఊర్ధ్వం న జీవేయం ||కృశాంగీ ధర్మచారిణీ రావణాంతః పురే రుద్ధా మృగీవ ఉత్ఫుల్లలోచనా సీతా ఇతి మామ్ అబ్రవీత్||

తా|| "ఓ దశరథాత్మజ ! జీవితము ఇంకా ఒక మాసమే ధరించియుండుదానను. రాక్షసులవశములో నున్న నేను ఒక మాసము దాటి జీవించియుండను". కృశించిపోయి వున్న , ధర్మము పాటిస్తున్న రావణాంతః పురములో బందీగా వున్న, ఆడ లేడి వలె వికసించిన నేత్రములు గల ఆ సీత ఈ విధముగా నాకు చెప్పెను.

శ్లో|| ఏత దేవ మయాఽఽఖ్యాతం సర్వం రాఘవ యద్యథా||26||
సర్వథా సాగరజలేసంతారః ప్రవిధీయతామ్||27||

స|| రాఘవ యత్ యథా ఏతత్ సర్వం ఏవ మయా ఖ్యాతం| సర్వథా సాగరజలే సన్తారః ప్రవిధీయతామ్||

తా|| ఓ రాఘవా ! ఏది ఏవిధముగా జరిగెనో అది అంతా నీకు చెప్పితిని. అన్నివిధములుగా సాగర జలములను దాటు మార్గము మనము చూడవలయును

శ్లో|| తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా
తచ్చాభిజ్ఞానం రాఘవాయప్రదాయ|
దేవ్యా చాఖ్యాతం సర్వమేవానుపూర్వ్యా
ద్వాచా సంపూర్ణం వాయుపుత్త్రః శశంస||28||

స|| వాయుపుత్రః తౌ రాజపుత్త్రౌ జాతాశ్వాసౌ విదిత్వా తత అభిజ్ఞానం ప్రదాయ దేవ్యా అఖ్యాతం సర్వం ఏవ సంపూర్ణం ఆనుపూర్యాత్ వాచా శశంస||

తా|| వాయుపుత్రుడు ఆ రాజపుత్రులిద్దరూ స్వాంతన పొందినారని గ్రహించి అప్పుడు ఆ అనవాలుగా ఇచ్చిన చూడామణిని సమర్పించి, మొదటినుండి జరిగినది అంతయూ క్రమము తప్పకుండా రామునికి తెలిపెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచషష్టితమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఇదవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||